నల్లగొండలో ఒకేరోజు 6,400 కోళ్లు మృతి
నల్లగొండ: కోళ్ల ఫామ్‌లో ఒకేరోజు 6,400 కోళ్లు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళ్తే.. నార్కట్‌పల్లి మండలంలోని ఏనుగులదోరి గ్రామంలో ప్రీమియం కంపెనీ సహకారంతో తాను నిర్వహిస్తున్న కోళ్లఫామ్‌లో ఉన్నట్టుండి ఒకేసారి 6,400 కోళ్లు చనిపోయాయని బాధితుడు పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యానికి తెలియజేడంతో సిబ్బంది వచ్చి ఘటనకు గల కారణాలను పరిశీలించారు. అయితే కోళ్లఫామ్‌కు సంబంధించిన నీటిట్యాంకులో విషపూరిత రసాయనాలు కలిపిన ఆనవాళ్లు దొరికాయని వారు తెలిపారు. ఆ విషపూరిత నీటిని తాగి కోళ్లు చనిపోయాయని సిబ్బంది వెల్లడించారు.