ఒయు డిస్టెన్స్ పరీక్షల తేదీల్లో మార్పు
హైదరాబాద్: ఒయు పరిధిలోని పీజీఆర్ఆర్సీడీఈ (ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఈ పరీక్షలను వారం రోజులపాటు వాయిదావేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి రెండు నుంచి జరగాల్సి ఉన్నాయి. అయితే అవి ఫిబ్రవరి 10 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
మారిన తేదీల ప్రకారం..
- ఫిబ్రవరి 10న (బుధవారం)- పేపర్-1
- ఫిబ్రవరి 11న (గురువారం)- పేపర్-2
- ఫిబ్రవరి 12న (శుక్రవారం)- పేపర్-3
- ఫిబ్రవరి 13న (శనివారం)- పేపర్-4
- ఫిబ్రవరి 15న (సోమవారం)- పేపర్-5/ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పేపర్-1 ప్రాక్టికల్స్
- ఫిబ్రవరి 16న (మంగళవారం)- పేపర్-6/ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పేపర్-2 ప్రాక్టికల్స్
- పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు నిర్వహిస్తారు.