ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు కెసిఆర్ నిర్ణయం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) తెలంగాణ సిఎం కెసిఆర్ శుభవార్త చెప్పారు. ఈ మేరకు వారికి పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం పేర్కొన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్య్యుఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.