మ‌హ‌బూబాబాద్‌లో ఆటో-లారీ ఢీ.. ఆరుగురి మృతి

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం మ‌ర్రిమిట్ట వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీ-ఆటో ఢీకొని ఆరుగురు అక్క‌డికక్క‌డే మృతిచెందారు. పెళ్లి బట్టలు కొనేందుకు వెళ్తూ పెళ్లి పీటలెక్కాల్సిన యువతితో పాటు కుటుంబం ఈ ప్రమాదంలో మృత్యుఒడికి చేరింది. ఎర్రకుంట తండాకు చెందిన ప్రమీలకు వివాహం నిశ్చయం కాగా.. పెళ్లి బట్టలు కొనేందుకు కుటుంబీకులు నర్సంపేటకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద నర్సంపేట నుంచి గూడూరు వైపుగా వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రమీల, ఆమె తల్లి కళ్యాణి, అన్న ప్రదీప్, బాబాయ్ ప్రసాద్, ఆయన కూతురు దివ్య, చిన్నాన్న కొడుకు, ఆటో డ్రైవర్‌ అయిన రాము అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కెసిఆర్ దిగ్బ్రాంతి
ఈ ప్ర‌మాదంపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.