మహారాష్ట్రలో కొత్తగా 2,771 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,771 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,000కు చేరింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,21,184కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో 2,613 మంది కరోనా బారినుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,25,800కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,147 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.