గాంధీ ఆదర్శప్రాయుడు: కెసిఆర్
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. మహ్మాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి అన్నారు.