ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ ఫీజుకు చివరి తేదీ ఫిబ్రవరి 12
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజును ఫిబ్రవరి 12వ తీదీ లోగా చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మూడవ సెమిస్టర్, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఫిబ్రవరి 17వ తేదీ వరకు రూ.200 ఆలస్య రుసుంతో చెల్లించవచ్చని తెలిపారు.
బీఈడీ, ఎంబీఏ పరీక్ష ఫలితాల విడుదల
ఓయూ పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలతోపాటు ఎంబీఏ (బీఎం), ఎంబీఏ – ఎంఏఎం (న్యూ స్కీమ్), ఎంబీఏ – ఎంఏఎం (ఓల్డ్ స్కీమ్) ఫలితాలను అధికారులు ప్రకటించారు. www.osmania.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.