తెలంగాణ కొత్తగా 163 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక తెలంగాణలో కరోనాతో నిన్న ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1599కి చేరింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,94,469కి చేరింది. ఇందులో 2,90,630 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,240 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరిలో 828 మంది హోం ఐసోలేషన్ చికిత్స పొందుతున్నారు. జిహెచ్ ఎంసిలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి.