తెలంగాణ కొత్తగా 165 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2,97,278 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,93,940 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 1715 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా గత 24 గంట్లో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1623కి చేరిందని అధికారులు వెల్లడించారు.