రాజన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.
