భారత్లో భారీగా పెరిగిన కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,327 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,92,088కు పెరిగింది. ఈ మేరకు శనివారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా మరో 14,234 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,08,54,128 మంది కోలుకున్నారు. కాగా తాజాగా కరోనా ప్రభావంతో 108 మంది మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,57,656కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,80,304 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.