డిప్యూటి ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ పోస్టులు 24

DEO posts: తెలంగాణ‌లో డిప్యూటి ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. డిఇఒ/ గెజిటెడ్ హెడ్‌మాస్ట‌ర్ గ్రేడ్‌-1 పోస్టుల భ‌ర్తీకి జూన్ 12 నుండి జులై 19 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుండి 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఒసి, బిసి అభ్య‌ర్థులకు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణ‌యించారు. ఎస్‌టి, ఎస్‌సి, దివ్యాంగుల‌కు రూ. 500గా నిర్ణియించారు.
ఎస్‌టి, ఎస్‌సి, బిసి, ఇడ‌బ్ల్యుఎస్ అభ్య‌ర్థుల‌కు 5 ఏళ్లు.. దివ్యాంగుల‌కు 10 ఏళ్ళు వ‌య‌స్సు స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

అర్హ‌త‌: డిగ్రీ, బిఇడి ఉత్తీర్ణ‌త‌తో పాటు 55% మార్కుల‌తో పిజి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌టి, ఎస్‌సి , బిసి , దివ్యాంగుల‌కు అక‌డ‌మిక్‌, ప్రొఫెష‌న‌ల్ విద్యార్హ‌త‌ల్లో 50% మార్కులు ఉండాలి.

మ‌ల్టిజోన్‌లో-1లో 10పోస్టులు, మ‌ల్టీజోన్ -2లో 14 పోస్టులు క‌ల‌వు.

Leave A Reply

Your email address will not be published.