నామాకు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు చెప్పిన లోక్‌స‌భ

న్యూఢిల్లీ: ఖ‌మ్మం ఎంపి నామా నాగేశ్వ‌ర రావు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ ఆయ‌న‌కు పుట్టిన రోజుశుభాకాంక్ష‌లు చెప్పింది. ఇవాళ (సోమ‌వారం) మ‌ధ్యాహ్నం రైల్వే కేటాయింపుల అంశంపై లోక్‌స‌భ‌లో చ‌ర్చ స‌మ‌యంలో రైల్వే అంశంపై మాట్లాడేందుకు ఎంపి నామా లేచి నిలబ‌డ్డారు. ఆ స‌మ‌యంలో చైర్‌లో ఉన్న ప్యాన‌ల్ స్పీక‌ర్ మిథున్ రెడ్డి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు ఎంపి నామా నాగేశ్వ‌ర‌రావుకు. ఈ రోజు మీ జ‌న్మ‌దినం.. మీకు కావాల్సినంత స‌మ‌యం తీసుకోండి అంటూ ప్యాన‌ల్ స్పీక‌ర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.