ఏప్రిల్ 9న పార్టీ ఏర్పాటు ప్రకటన: వైఎస్ షర్మిల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఖమ్మం వేదికగానే సమరశంఖం పూరిద్దామని.. ఏప్రిల్ 9న లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు షర్మిల వెల్లడించారు. సమస్యల పరిష్కారానికే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని అభిమానులు షర్మిలను కోరారు.