SSC: 12 వేల పోస్టులతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ 2026 నోటిఫికేషన్
కేంద్ర మంత్రిత్వ శాఖలో 12 వేల పోస్టులు
12 వేల పోస్టులతో స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థలలో ఉన్న ఖాళీగా ఉన్న మొత్తం 12,256 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టుల వివరాలు
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (Income Tax Inspector) , సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, సబ్ -ఇన్‌స్టెక్టర్ (CBI), ఆడిటర్, టాక్స్ అసిస్టెంట్ (Tax Assistant)వంటి పోస్టులు కలవు.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత
జూన్ 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. టైర్ -1, టైర్-2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.