సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఐదుగురు మృతి
ఆగ్రా: ఆగ్రాలోని ఫతేహాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో సెప్టిక్ ట్యాంక్‌లో ముగ్గురు మైనర్ సోదరులు, మరో ఇద్దరు చనిపోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రతపుర గ్రామంలో పదేళ్ల అనురాగ్ ఆడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయిన ఘటనలో ఆ బాలుడిని రక్షించే క్రమంలో మరో నలుగురు మరణించారని సీనియర్ పోలీసు అధికారి బాబ్లూ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు సహా ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకున్నది.
పోలీసుల తెలిపిన సమాచారం మేరకు.. ప్రతాప్‌పురా గ్రామంలో అనురాగ్ అనే (10) అనే బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయాడు. వెంటనే గమనించిన అతని మరో ముగ్గురు హరి మోహన్ (16), అవినాష్ (12) సోను (25)తో సహా నలుగురు ట్యాంక్‌లోకి దిగారు. దీంతో వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పొరుగునే ఉన్న యోగేశ్ అనే వ్యక్తి సైతం వీరిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతను సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గ్రామస్తులు వారందరినీ వెంటనే బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అనురాగ్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. అలాగే మిగతా నలుగురు ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీకి తరలిస్తున్న క్రమంలోనే మృతి చెందారు. మృతుల్లో హరిమోహన్, అవినాష్, అనురాగ్ సోదరులు. ఈ సంఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
