చెట్టును ఢీకొన్న కారు: ఇద్దరు మృతి
కడెం: నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం మండలంలోని నవాబుపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.