వరంగల్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మహిళల మృతి
వరంగల్ రూరల్ : జిల్లాలో ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ – భూపాలపట్నం రహదారి 163 హైవేపై ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్.. వరంగల్ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 19 మంది కూలీలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.