రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు ఆర్టీసీ ఉద్యోగుల మృతి

ములుగు: జిల్లాలోని పందికుంట క్రాస్ రోడ్డు వద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రోజువారీ విధుల్లో భాగంగా ఇవాళ (ఆదివారం) ఉదయం ద్విచక్ర వాహనంపై నర్సంపేట డిపోకు కంట్రోలర్ సదానందం, కండక్టర్ సునీత బయలు దేరిన వారిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రూ ప్ర‌మాద స్థ‌లంలోనే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.