తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1498 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,735కి చేరింది. 245 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 3,03,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9993 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా కరోనాతో రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1729కి చేరిందని అధికారులు బులిటెన్లో పేర్కొన్నారు.