18 ఏళ్ళు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
కరోనా వ్యాక్సిన్ సరళీకృత మరియు వేగవంతమైన దశ 3 గా దీనిని చెబుతున్నారు. ముందు మెడికల్, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. తరువాత 45 ఏళ్ళ వారికి ఇచ్చారు. అయితే కరోన కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయిన్చేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. దీంతో వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తిని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలు..
- 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్.
- 50% టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు కేంద్రం అనుమతి
- 50% టీకాలు రాష్ట్రాలకు, విపణిలో అమ్ముకోవచ్చు
- ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చు
- ఉత్పత్తి సంస్థల నుంచి టీకాలు నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు అనుమతి
- గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్లైన్ వర్కర్లకు 45 ఏళ్లు దాటి వారికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ యథావిధిగా కొనసాగుతుంది.