పెళ్ళి వేడుకల్లో నిబంధనలు బేఖాతరు.. పలువురిపై కేసు నమోదు
లక్షెట్పేట్ (CLiC2NEWS): పెళ్లిళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీసులు తెలిపారు. జెండా వెంకటాపూర్, గుల్లకోట, వెంకటరావుపేట్, లక్షెట్టిపేట్, దౌడేపల్లి గ్రామాల్లో పెళ్లి వేడుకల్లో అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా వివాహం జరిపిస్తున్నారనే సమాచారంతో ఎస్సై చంద్ర శేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వేడుకలు అనుమతులు తీసుకొని జరిపించాలని ఆదేశించారు. వివాహ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.