AP: కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సిఎం జగన్‌ భేటీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈరోజు సీఎం ఢిల్లీకి బ‌మ‌లుదేరిన విషయం తెలిసిన‌దే. ఈప‌ర్య‌ట‌న‌లో భాగంగా మెద‌ట‌గా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావ్డేక‌ర్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం జగన్‌ వివరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్‌ చర్చించనున్నారు

గురువారం న్యూఢిల్లీలో కేంద్ర‌మంత్రి జావ్డేక‌ర్‌తో స‌మావేశ‌మైన ఎపి సిఎం జ‌గ‌న్‌
Leave A Reply

Your email address will not be published.