LPG Gas: ఏ డీల‌ర్ ‌నుంచైనా సిలిండ‌ర్ పొంద‌వ‌చ్చు

న్యూఢిల్లీ (CLiC2NEWS): గ్యాస్ వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన డీల‌రు ద‌గ్గ‌ర రీఫిల్ బుక్ చేసుకొనే అవ‌కాశం క‌ల్పిస్తుంది కేంద్ర పెట్రోలియం శాఖ‌. వంట గ్యాస్ వినియోగ‌దారుల‌కు కంపెనీని మార్చ‌కుండా డీల‌రును ఎంచుకునే అవ‌కాశం క‌ల‌గ‌నుంది. ఇదివ‌ర‌కు మ‌నం ఏ డిస్ట్రిబ్యూట‌ర్ ద‌గ్గ‌ర గ్యాస్ క‌నెక్ష‌న్ తీసుకుంటే అక్క‌డే సిలిండ‌ర్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడిక ఎవ‌రకు నచ్చిన డిస్ట్రిబ్యూట‌ర్ దగ్గ‌ర గ్యాస్ బుక్ చేసుకొనే విధంగా సిలిండర్ బుకింగ్ పోర్ట‌బిలిటీని తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ముందుగా ఈ ప‌ద్ద‌తిని చండీగ‌ఢ్, కోయంబ‌త్తూరు,గురుగ్రాం, పుణే, రాంచీ న‌గ‌రాల్లో అమ‌లు చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.