TS: కూలీలకు రోజువారి కనీస వేతనం పెంపు..
హైదరాబాద్ (CLiC2NEWS): కూలీలకు రోజువారి కనీస వేతనం రూ. 300 నుంచి రూ. 390కి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు… పార్ట్‌టైమ్ వర్కర్ల వేతనం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పెంచిన కనీస వేతనం ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తుందన్నారు.