TPCC President: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టిపిసిసి) అధ్య‌క్షుడిగా ఎంపి రేవంత్ రెడ్డి నియమిస్తూ ఎఐసిసి (అఖిల‌భార‌త కాంగ్రెస్ క‌మిటీ) ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే.

కొత్త‌గా కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం. అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌, టి. జగ్గారెడ్డి, బి. మ‌హేష్‌కుమార్ గౌడ్‌ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది.

ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌‌లను నియ‌మించింది. ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.