జైపూర్ లో పల్లె ప్రగతిలో `శ్రమదానం`..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి లో భగంగా ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. పల్లె ప్రగతి- 4 వ విడత లో జైపూర్ గ్రామ పంచాయతీ లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారని గ్రామ సర్పంచ్ ఎ సువరుణ రాజమల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అంబాలా సంపత్ రెడ్డి, ఎంపిటిసి లింగస్వామి, విలేజ్ సెక్రెటరీ ఉదయ్‌కుమార్, టిఆర్ ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ అరవిందరావు, వార్డు సభ్యులు, కోప్షన్ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
