సకాలంలో రుణాలు అందించాలి: ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట (CLiC2NEWS): కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్న దృష్ట్యా పేద మధ్యతరగతి ప్రజలకు రుణాలు అందిస్తూ బ్యాంకులు ఆదుకోవాలని రాష్ట్ర ఆల‌డ‌ర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు కోరారు. అలాగే రైతుబంధు, ఫించన్లు, పంట‌ రుణాల్లో కోత విధించొద్దని బ్యాంకర్లకు మంత్రి సూచించారు. సిద్దిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ వ‌ర్సిటీలో యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌ను మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 17 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్న దృష్ట్యా పేద మధ్యతరగతి ప్రజలకు రుణాలు అందిస్తూ బ్యాంకులు ఆదుకోవాలని కోరారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనమైన తర్వాత మొదటి బ్రాంచ్‌ను సిద్దిపేట జిల్లా హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నందుకు బ్యాంకు వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, యూనియన్ బ్యాంకు ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, రీజనల్ మేనేజర్ జి శంకర్ లాల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.