ఎల్లారెడ్డి అభివృద్ధిలో పాలుపంచుకుంటాను: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎల్లారెడ్డి (CLiC2NEWS): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో సోమవారం 9 కోట్ల 20 లక్షల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో తాను స్వయంగా పాలు పంచుకుంటానని అన్నారు. ఈరోజు శంకుస్థాపన చేసిన రోడ్డు నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి కావాలని R&B సూపరింటెండింగ్ ఇంజనీరును ఆదేశించారు. ముఖ్యమంత్రి ద్రృష్టికి తీసుకెళ్లి గాంధారి మండలానికి రెగ్యులర్ గా ఇచ్చే ఇళ్లకు అదనంగా మరో ఐదు వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శాంక్షన్ అయ్యేలా చేస్తానని అన్నారు. గాంధారిలో సిసి రోడ్ల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణానికి 20 లక్షల రూపాయలు సాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా మన కోసం, మన గ్రామాల కోసం ఉపయోగపడే పనులు చేస్తున్నామని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ల ఏర్పాటుతో పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నట్టు తెలిపారు. గతంలో గాంధారి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి గాను 20 లక్షలు వచ్చేవని, కానీ ప్రస్తుతం ఒక కోటి రూపాయలు వస్తున్నాయని, ఇలాగే అన్ని గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కెసిఆర్ కిట్స్, గర్భిణీ స్త్రీలకు 13 వేల రూపాయల ఆర్థిక సహాయం, ఎకరానికి 10వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం, రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు వంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల నుండి 57 సంవత్సరములు దాటిన వారికి ముఖ్యమంత్రి పెన్షన్ ప్రకటించారని తెలిపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. దిగువ నుండి ఎగువకు కాలేశ్వరం ద్వారా నిజాంసాగర్ కు 1.5 టీఎంసీల నీటిని ఇవ్వడం జరిగిందని, రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సారథ్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ద్వారా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందుతున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ, జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి నిర్వహణ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాంధారి వచ్చే రోడ్డులో మూడు వరుసల మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చాలా అందంగా ఉందని అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇంటింటికి అందించడం జరుగుతున్నదని, ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్, ర్యాలీ, ట్యాంకర్ల ద్వారా పల్లె ప్రగతి పనులను సులభంగా నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. ప్రతి నెలా జిల్లాలోని గ్రామ పంచాయతీల నిధుల కింద 11 కోట్లు రావడం జరుగుతున్నదని, తద్వరా గ్రామాల అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని, దీనిలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కలు సంరక్షించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ పంచాయతీలలో వంద మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్ మాట్లాడుతూ, గాంధారి మండల కేంద్రంలో 10 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, చరిత్రలో లేనివిధంగా రైతాంగానికి సాగునీటి కోసం జూలైలో నిజాంసాగర్ నీటిని విడుదల చేయడం గొప్ప విషయమని, ముఖ్యమంత్రి రైతుల క్షేమం కోసం ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రతి తండాకు సిసి రోడ్డు వచ్చేలా చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దఫేదార్ శోభా రాజు, ఆర్డిఓ శీను, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీమంత్రి నేరెళ్ళ ఆంజనేయులు, ఎంపీపీ రాధా బలరాం, జడ్పిటిసి శంకర్ నాయక్, గాంధారి సర్పంచ్ సంజీవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Hello it’s me, I am also visiting this web page daily, this web page is really nice and the visitors are really
sharing pleasant thoughts.
An interesting discussion is worth comment. I do think that you
should publish more about this topic, it might not be a taboo
matter but typically people do not discuss these
topics. To the next! Cheers!!
I believe this is among the so much vital information for me.
And i’m satisfied studying your article. But wanna remark on some
normal issues, The website taste is wonderful, the articles is truly excellent : D.
Good task, cheers
Hello There. I discovered your blog the use of msn. This is
a very smartly written article. I will make sure to bookmark it and come back to learn more of your useful
information. Thank you for the post. I’ll certainly comeback.
çok bilgilendirici bir yazı olmuş ellerinize sağlık teşekkür ederim
Çok işime yaradı bende bunu nasıl yapacağımı araştırıyorum. Paylaşım için teşekkür ederim.