అవకాశవాదులకు స్థానం లేదు: మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ 70 యేళ్లలో చేయని పలులు ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి చేసి చూపిందని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని సదాశివపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉన్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేశారు.
చేశారు. తెలంగాణ గురించి మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గొంతు నొక్కి అసెంబ్లీ నుంచి పంపించాడు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణను అవమానించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన వారసులమని కొందరు వస్తున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. అలాంటి అవకాశ వాదులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు.