TS: తెలుగు విద్యార్ధికి రూ.2 కోట్ల స్కాలర్షిప్
హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణకు చెందిన ఇంటర్ విద్యార్ధిని శ్వేతా రిడ్డి(17) కి ఈ అరుదైన అవకాశం లభించింది. అమెరికాలోని లఫాయేట్ కాలేజ్ శ్వేతారెడ్డికి రూ.2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఇవ్వనుంది. ఈ కాలేజ్లో శ్వేతారెడ్డికి 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్తోపాటు ఈ స్కాలర్షిప్ను ప్రకటించింది. డైయర్ ఫెలోషిప్ పేరుతో కళాశాల ప్రతి సంవత్సరం ఆరుగురు విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తుంది. ప్రపంచంలోని ఆ ఆరుగురు విద్యార్థుల్లో శ్వేతారెడ్డి ఈ అరుదైన అవకాశం దక్కించుకుంది.