ఈటలది ఆత్మగౌరవం కాదు.. ఆత్మ వంచన: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదని.. ఆత్మవంచన అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెసిఆర్ మండిపడ్డారు. ఈటల.. తాను మోసమపోతూ ప్రజలనూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై మంత్రి కెటిఆర్తొలిసారి స్పందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంత గౌరవిమిచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టారు. ఈటల చేసిన తప్పును తానే ఒప్పుకున్నారు.
ఐదేళ్ల క్రితమే ఆయన ఆత్మగౌరవం దెబ్బతింటే మంత్రిగా ఎందుకు కొనసాగారు? ఐదేళ్ల నుంచి ఈటల అడ్డంగా మాట్లాడినా కేసీఆర్ మంత్రిగా ఉంచారు. ఈటల టీఆర్ఎస్లో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించారని గుర్తు చేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది అని స్పష్టం చేశారు.
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి అని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం అన్యాయం చేశామని పాదయాత్ర చేస్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.