స్కూటీని ఢీకొన్న లారీ.. తల్లీకూతుళ్లు మృతి
గుంటూరు(CLiC2NEWS): తెనాలి మార్కెట్ యార్డ్‌లో లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. స్కూటీపై కూతురిని స్కూల్ నుండి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.