కోవిడ్ బాధితులకు బాస‌ట‌గా జ‌గ‌న్ స‌ర్కార్‌: ఎమ్మెల్సీ తోట‌

మండపేట (CLiC2NEWS): క‌రోనా బాధితుల‌కు అండ‌గా వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ నిలుస్తుంద‌ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. స‌్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం  కోవిడ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అందజేశారు. కోవిడ్ బాధితులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి వ్యాక్సినేషన్ చర్యలు ముమ్మరంగా అమలు చేస్తుంది అన్నారు. మెగా డ్రైవ్ ల పేరుతో రాష్ట్రమంతా వ్యాక్సినేషన్ చర్యలు విస్తృతంగా అమలు చేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు బాసటగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధగా మిగిలిన కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు గుత్తుల తేజస్విని, సునీతలు కు అలాగే మండపేటకు చెందిన గనిశెట్టి దుర్గలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున ప్రభుత్వం ద్వారా మంజూరైన మొత్తం 30 లక్షల రూపాయల బాండ్ పేపర్లను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అన్నారు. వారి అవసరాల నిమిత్తం వడ్డీ సొమ్మును ఆరు నెలలకోసారి వినియోగించుకోవచ్చని అన్నారు. 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ సొమ్మును మొత్తం బ్యాంక్ నుండి విత్ డ్రా చేసుకుని భవిష్యత్ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవో గజలక్ష్మి, సూపర్వైజర్ సత్య వేణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.