బెల్లంపల్లి రూరల్ సీఐ పేరుతో డబ్బుల డిమాండ్!
మంచిర్యాల: ఆన్లైన్, సోషల్ మీడియాలో మోసగాళ్లు రోజురోజుకి పెట్రేగిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్ పేరిట ఫేస్ బుక్లో ఓ దుండగుడు ఖాతా తెరిచాడు. డబ్బులు కావాలని పలువురికి సందేశాలు పంపించాడు. అప్రమత్తమైన సీఐ, మాయగాళ్లను నమ్మవద్దని కోరారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే మాకు సమాచారమివ్వాలని కోరారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.