Hyderabad: నగరంలోమంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీం(ఎండబ్ల్యూఎస్ఎస్) ఫేజ్ – 2లో కలాబ్‌గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కంది గ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది.
కావున, తేదీ: 29.10.2021, శుక్రవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 30.10.2021, శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 36 గంటల వరకు మంజీరా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీం(ఎండబ్ల్యూఎస్ఎస్) ఫేజ్ – 2 పరిధిలోకి వచ్చే పటాన్చెరు నుంచి హైదర్‌నగర్ వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హైదర్‌నగర్, రాంనరేష్‌నగర్, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్పీనగర్ తదితర ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – మియాపూర్, దీప్తినగర్, శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 23 – నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 32 – బొల్లారం.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
సం/-
పౌర సంబంధాల అధికారి.