TS: యాదాద్రి ఆలయానికి కేజీ బంగారం: ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి (CLiC2NEWS) : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కేజీ బంగారం విరాళం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్ర్రి కెసిఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం తరపున కిలో బంగారం అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన డబ్బులు త్వరలోనే ఆలయ అధికారులకు అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.