TS: ఎల్బిన‌గ‌ర్ లో 110 కిలోల గంజాయి ప‌ట్టివేత

హైద‌రాబాద్ (CLiC2NEWS) : అర‌టిపండ్ల లోడ్‌లో 110 కిలోల గంజాయిని త‌ర‌లిస్తున్న ఇద్దరు అంత‌రాష్ట్ర నేర‌గాళ్ల‌ను ఎల్బిన‌గ‌ర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎపి విశాఖ ఏజెన్సీ నుండి హైద‌రాబాద్ మీదుగా మాహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీని విలుల సుమారు రూ.18.50 ల‌క్ష‌లు ఉంటుంద‌ని రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ (సిపి) మ‌హేశ్ భ‌గ‌వ‌త్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దిరిని అరెస్ట్ చేయ‌గా మ‌రో ఇద్దరు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలిపారు.
గంజాయి ప‌ట్టుకునేందుకు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నామ‌ని, డ్ర‌గ్స్ నివార‌ణ‌కు `న‌యాస‌వేరా` కార్య‌క్చ‌మంతో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.