ఆటో ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తగూడెం చౌరస్తాలో ఆటోను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఘటనాస్థలంలోనే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఉత్తటూరుకు చెందిన శ్రీశైలం గా గుర్తించారు. నల్లగొండ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.