మానకొండూరులో చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
మానకొండూరు (CLiC2NEWS): కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున మానకొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు… ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ ప్రాంతంలోని జ్యోతినగర్‌కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల బాలాజీ, శ్రీరాజు, జలందర్, సుధాకర్‌రావు గురువారం బంధువుల ఇంటికి ఖమ్మం జిల్లాలోని కల్లూరుకు వెళ్లి కార్యక్రమం ముంగించుకని అదే రోజు రాత్రి కరీంనగర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కారు మానుకొండూరు సమీపంలోకి రాగానే చెట్టుకు ఢీ కొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, బాలాజీ శ్రీరాజు, జలందర్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. సుధాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.