కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు తీర్చిదిద్దుతాం: మంత్రి హార‌శ్‌రావు

సంగారెడ్డి (CLiC2NEWS): కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు తీర్చిదిద్ద‌డ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మని రాష్ట్ర ఆర్ధిక‌, వైద్యారోగ్య శాఖామంత్రి హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు. దళిత బంధు, మ‌న ఊరు మ‌న బ‌డితో పాటు ప‌లు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కెసిఆర్ ఇచ్చిన హామీ ప్ర‌కారం రూ. 390 కోట్ల నిధులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సిఎం కెసిఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ నిధ‌లు ప్ర‌జ‌లు అత్యంత అవ‌స‌ర‌మైన ప‌నుల‌కు ఉపయోగించే విధంగా ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని, ఈవిధానంలో ఎమ్మెల్యేలు చొర‌వ చూపాల‌ని మంత్రి అన్నారు.

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుండి అన్ని పాఠ‌శాల‌లో మ‌న ఊరు- మ‌న బ‌డి ప్రారంభించాల‌ని కెసిఆర్ సంక‌ల్పించార‌ని, ఈ ప‌థ‌కం ఒక అద్భుత‌మైనద‌ని మంత్రి అన్నారు. మార్చి 8వ తేదీన సిఎం కెసిఆర్ వ‌న‌ప‌ర్తి జిల్లాలో మ‌న ఊరు మ‌న‌బ‌డి కార్య‌క్ర‌మం లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్ర‌బుత్వ పాఠ‌శాల‌ల్ని తీర్చిదిద్ద‌ట‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మని మంత్రి స్ప‌ష్టం చేశారు. దీనికోసం రూ. 7,289 కోట్లు మంజూర‌య్యాయ‌ని, ఈ నిధులు స‌క్ర‌మంగా వినియోగిస్తే విద్యా వ్య‌వ‌స్థ‌లో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.