ములుగులో హెల్త్ప్రోఫైల్ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
ములుగు (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇ-హెల్త్‌ప్రొఫైల్ ప్రాజెక్టును రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి మంత్రి హారీశ్‌రావు ములుగులో లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిరిసిల్ల, ములుగులో 40 రోజుల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లాలోని కలెక్టరేట్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తో కలిపి హరీశ్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్యసేవలను మరింత విస్తరంచడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ములుగులో ఇ-హెల్త్ ప్రొఫైల్‌ను ప్రారంభించటం చాలా సంతోషకరమని సత్యవతి రాథోడ్ అన్నారు. ఒక్క కార్డుతో ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మంత్రి తెలిపారు.