చిరంజీవిని క‌లిసిన కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవిని శ‌నివారం క‌లిశారు. ఏప్రిల్‌లో నిర్వ‌హించే అఖిల భార‌త సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు రావాల్సిందిగా చిరంజీవిని ఆహ్వానించారు. వ‌చ్చేనెల 1వ తేదీనుండి 3వ తేదీ వ‌ర‌కు ఎన్టీఆర్ స్టేడియంలో అఖిల భార‌త సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు రావాల్సిందిగా మంత్రి ఆహ్వానించారు. ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డం త‌న‌కు ద‌క్కిన గౌర‌వ‌మ‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి అన్నారు. జాన‌ప‌ద‌, గిరిజ‌న క‌ళ‌లు, సంగీతం, వివిధ రాష్ట్రాల ప్ర‌జ‌ల సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఇలాంటి ఉన్న‌త‌మైన వేదిక‌లు అవ‌స‌ర‌మ‌ని చిరంజీవి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.