Telangana: డ్వాక్రా మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌..

 

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా మ‌హిళ‌లు పొదుపు చేసుకున్న అభ‌య‌హ‌స్తం నిధుల‌ను తిరిగి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు మంత్రులు హ‌రీశ్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి ఆయా శాఖ‌ల కార్య‌ద‌ర్శ‌లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

తెలంగాణ‌లో రాష్ట్ర వ్యాప్తంగా 21 ల‌క్ష‌ల మంది డ్వాక్రా సంఘాల మ‌హిళలు రూ. 545 కోట్ల వ‌ర‌కు పొదుపు చేసుకున్నారు. ఈ అభ‌య హ‌స్తం కింద రూ. 500 కంట్రిబూట‌రీ పెన్ష‌న్ కోసం ఈ పొదుపు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆస‌రా ప‌త‌కం కింద మొద‌ట్లో రూ. 1000 నుండి ఇప్పుడు రూ. 2016లు పెన్ష‌న్‌గా ఇస్తున్నారు. పెన్ష‌న్ ఎక్కువ వ‌స్తున్న కార‌ణంగా మ‌హిళలు అభ‌య‌హ‌స్తం డ‌బ్బులు త‌మ‌వి త‌మ‌కు కావాల‌ని అడుగుతున్నారని, ఆమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రో రెండు, మూడు రోజుల‌లో ఆ నిధులు ఆయా మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.