అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రాకండి: ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అల్ప‌పీడ‌న ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌రల‌తో ప‌లు లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఎమ్మెల్సీ క‌విత ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌లో వ‌ర్షాల ప‌రిస్థితిపై ముఖ్య‌మంత్రి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నార‌ని చెప్పారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌కు త‌గిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్ద‌లా అండ‌గా నిలుస్తున్నార‌ని తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.