ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు: చిరు
హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ పండుగను పురష్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. ఆడపడుచులు తెచ్చే బతుకమ్మలతో ఆ ప్రాంతాలన్నీ పుష్పాభిషేకాన్ని తలపిస్తాయి. తెలంగాణ సంస్కృతికి ఇదో ప్రతీక. తెలంగాణ ప్రజలు ఎంతో విశిష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. రాష్ట్ర మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ట్వీట్ చేశారు. ”బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు.. ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను..” అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
బతుకమ్మ 💐🌼సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. 🌷🌻🌹బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను.🌺🌻🌹 pic.twitter.com/qM8tHhrpfd
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2020