ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఫిర్యాదు బాక్స్‌లు

కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న ఆలోచ‌న

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిప‌ల్లి వెంక‌ట ర‌మణారెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వినూత్న ఆలోచ‌న చేశారు. ఒకే ఒక్క‌డు సినిమా త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని క‌మాన్ వ‌ద్ద ఫిర్యాదు బాక్స్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ బాక్స్‌లో ఉన్న ఫిర్యాదుల‌ను గ్రామాల‌కు తానే నేరుగా వ‌చ్చి ప‌రిష్క‌రిస్తాన‌ని, నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామాల్లో ఇవి ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఫిర్యాదు బాక్స్‌ల ద్వారా త‌న‌కు తెలియ‌జేయాల‌ని ఎమ్మెల్యే సూచించారు.

Leave A Reply

Your email address will not be published.