హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రద్దు
8,9,10 తేదీల్లో కార్యాలయాలు యథావిధిగా నడపాలి
హైదరాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉన్నందున ఈ నెల 8,9,10 తేదీల్లో సెలవులు రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తేదీల్లో కార్యాలయాలు యథావిధిగా నడపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.