ఇంద్రకీలాద్రిపై రెండోరోజు గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు
విజయవాడ (CLiC2NEWS): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రులలో రెండోరోజు కనకదుర్గ అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీ దేవిని పూజిస్తూ.. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ దుర్గాప్రసాద్, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్‌బాబు తదితర ప్రముఖులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు.