సోష‌ల్ మీడియా బాధితుల్లో నేనూ ఉన్నా: ష‌ర్మిల‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): సోష‌ల్ మీడియా సైకో బాధితుల్లో నేనూ ఉన్నాన‌ని.. త‌ల్లి, చెల్లి అనే ఇంగితజ్ఞానం లేకుండా పోస్టులు పెట్టార‌ని ఎపిసిసి అధ్య‌క్షురాలు ష‌ర్మిల మండిప‌డ్డారు.  మాన‌వ సంబంధాలు , ర‌క్త సంబంధాలు మ‌రిచి మృగాలుగా మారార‌ని.. కొంద‌రు సైకోలు, సైకో పార్టీల‌తో క‌లిసి సోష‌ల్ మీడియాను భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్ర‌శ్నించే మ‌హిళ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో రాక్ష‌సానందం పొందుతాన్నార‌ని.. ప‌రువు , ప్ర‌తిష్ట దెబ్బ‌తీసే పోస్టులు పెట్టి, పైశాచిక ఆనందం పొందే సైకోల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.